Supreme Court: ఉదాసిన్ మ‌ఠం భూములపై కీలక తీర్పు

ABN , First Publish Date - 2022-09-15T03:46:05+05:30 IST

ఉదాసిన్ మ‌ఠం వ‌ర్సెస్ గ‌ల్ఫ్ ఆయిల్ కార్పొరేష‌న్ (ఐడీయ‌ల్ కెమిక‌ల్స్) కేసులో సుప్రీంకోర్టు..

Supreme Court: ఉదాసిన్ మ‌ఠం భూములపై కీలక తీర్పు

హైదరాబాద్‌: ఉదాసిన్ మ‌ఠం (Udasin Math) వ‌ర్సెస్ గ‌ల్ఫ్ ఆయిల్ కార్పొరేష‌న్ (Gulf Oil Corportion) (ఐడీయ‌ల్ కెమిక‌ల్స్) కేసులో సుప్రీంకోర్టు (Supreme Court) కీలక తీర్పు వెలువరించింది. ఆ భూములపై పూర్తి హక్కు ఉదాసిన్ మ‌ఠందేనని స్పష్టం చేసింది. కాగా కూకట్‌పల్లి వై జంక్షన్‌ దగ్గర ఉదాసిన్‌ మఠానికి 540 ఎకరాల స్థలం ఉంది. ఈ స్థలాన్ని 1964 నుంచి 1978 వరకు నాలుగు దఫాలుగా ఐడీఎల్‌ కెమికల్స్‌కు ఉదాసిన్‌ మఠం లీజుకిచ్చింది. ఉదాసిన్‌ మఠం భూములు బఫర్‌ జోన్‌లో ఉంది. అయినా మఠం భూములను ఐడీఎల్‌ కెమికల్స్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి వినియోగించింది. అంతేకాదు యాజ‌మాన్య హ‌క్కుల కోసం ఐడీయ‌ల్ కెమిక‌ల్స్ ప్రయ‌త్నించింది.  దీంతో గ‌ల్ఫ్ ఆయిల్ కార్పొరేష‌న్ లీజ్ నిబంధ‌న‌ల‌ను ఉల్లఘించిందంటూ 2011 నుంచి ఉదాసిన్ మ‌ఠం న్యాయ పోరాటం చేసింది. అటు ట్రిబ్యున‌ల్ నుంచి సుప్రీంకోర్టు వ‌ర‌కు కూడా ఉదాసిన్ మ‌ఠం, దేవాదాయ శాఖ‌ న్యాయ పోరాటం చేసింది. 


అయితే 2011లో ఐడీఎల్‌ కెమికల్స్‌కు లీజ్ వ్యవహారాన్ని ట్రిబ్యునల్‌ రద్దు చేసింది. ఇక ట్రిబ్యునల్ తీర్పును సవాలు చేస్తూ 2013లో ఐడీఎల్‌ కెమికల్స్‌ సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీంతో స్టేటస్‌కో మెయింటైన్ చేయాలని అప్పుడు సుప్రీంకోర్టు ఆదేశించింది. తాజాగా ఆ భూములపై ఉదాసిన్ మఠానివేనని తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం ఉదాసిన్‌ మఠం భూముల విలువ దాదాపు మార్కెట్‌లో రూ.15 వేల కోట్లుగా ఉంది.

Updated Date - 2022-09-15T03:46:05+05:30 IST