విద్యుత్తు తీగకు ఒకరు.. అప్పులకు మరొకరు..

ABN , First Publish Date - 2022-08-01T08:53:27+05:30 IST

ఆదిలాబాద్‌ జిల్లాలో ఆదివారం వేర్వేరు ఘటనల్లో ఇద్దరు రైతులు మృతి చెందారు. నేరడిగొండ మండలం కుమారికి చెందిన రైతు బిక్క బక్కన్న(65) తన పొలంలో గట్ల వెంట కొమ్మలు..

విద్యుత్తు తీగకు ఒకరు.. అప్పులకు మరొకరు..

ఆదిలాబాద్‌ జిల్లాలో ఇద్దరు రైతన్నలు బలి

నేరడిగొండ, జూలై 31: ఆదిలాబాద్‌ జిల్లాలో ఆదివారం వేర్వేరు ఘటనల్లో ఇద్దరు రైతులు మృతి చెందారు. నేరడిగొండ మండలం కుమారికి చెందిన రైతు బిక్క బక్కన్న(65) తన పొలంలో గట్ల వెంట కొమ్మలు కొడుతుండగా విద్యుత్‌ వైరు తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. గాజిలి గ్రామానికి చెందిన రైతు పెందుర్‌ వెంకటి (39) తనకున్న ఏడు ఎకరాల్లో పత్తి, సోయా పంటలు వేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట దెబ్బతినడంతో పెట్టుబడి కోసం తెచ్చిన రూ.5లక్షల అప్పులు తీర్చే దారి కానరాలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన వెంకటి.. పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

Read more