ఉపాధ్యాయుల పదోన్నతులు చేపట్టాలి

ABN , First Publish Date - 2022-09-08T06:07:57+05:30 IST

ఉపాధ్యాయుల పదోన్నతులు చేపట్టాలి

ఉపాధ్యాయుల పదోన్నతులు చేపట్టాలి

టీయూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి శైలేంద్రకుమార్‌

ఖిలావరంగల్‌, సెప్టెంబరు 7: ఉపాధ్యాయుల పదోన్నతులను ప్రభుత్వం వెంటనే చేపట్టాలని టీయూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి శైలేంద్రకుమార్‌ డిమాండ్‌ చేశారు. ఖిలావరంగల్‌ మధ్యకోటలోని ఆరెళ్ళి బుచ్చయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం సతీష్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమాన్ని ప్రవేశపెట్టిందన్నారు. దీంతో సరైన ఉపాధ్యాయులు లేక తల్లిదండ్రులు, విద్యార్థులు ఇబ్బందుల పాలవుతున్నారని తెలిపారు. 2015 నుంచి బదిలీలు, పదోన్నతులు లేక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఏర్పడిందన్నారు. 317 జీవో వలన ఆగిపోయిన 13 జిల్లాల స్పౌజ్‌ సమస్యను వెంటనే పరిష్కరించి భార్య, భర్తలను ఓకే జిల్లాలో పనిచేసేటట్లుగా చూడాలన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి జాటోతు లకుపతి, హనుమకొండ జిల్లా మహిళా అధ్యక్షురాలు దుగ్యాల సరస్వతి, మార్త రాధిక, సత్యనారాయణ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Read more