బతుకమ్మలు, బోనాలతో టీఆర్ఎస్ ర్యాలీ

ABN , First Publish Date - 2022-09-17T19:39:00+05:30 IST

తెలంగాణ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా పీపుల్స్ ప్లాజా (Peoples Plazs) నుంచి ఎన్టీఆర్ స్టేడియం (NTR Stadium) వరకు

బతుకమ్మలు, బోనాలతో టీఆర్ఎస్ ర్యాలీ

Hyderabad : తెలంగాణ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా పీపుల్స్ ప్లాజా (Peoples Plazs) నుంచి ఎన్టీఆర్ స్టేడియం (NTR Stadium) వరకు టీఆర్ఎస్ (TRS) ర్యాలీ (Rally) నిర్వహించింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ (minister srinivas goud) ఈ ర్యాలీని ప్రారంభించారు. ఎమ్మేల్యేలు కాలేరు వెంకటేష్ (Kaleru Venkatesh), సుధీర్ రెడ్డి (Sudhir Reddy), రసమయి బాలకిషన్ (Rasamayi Balakishan) తదితరులు హాజరయ్యారు. 5000 మంది కళాకారులతో ర్యాలీ జరిగింది. తెలంగాణ సంస్కృతి ఉట్టి పడేలా బతుకమ్మలు, బోనాలతో ర్యాలీలో కళాకారులు పాల్గొన్నారు. 30 రకాల కళా నృత్యాలతో ర్యాలీ కొనసాగుతోంది. 


ఇదిలా ఉండగా.. నేడు సీఎం కేసీఆర్ (CM KCR) బంజారా, ఆదివాసీ భవన్‌లను ప్రారంభించిన విషయం తెలిసిందే. బంజారాహిల్స్‌ (Banjara hills)లోని రోడ్‌నెం.10లో ఆదివాసీ, బంజారా భవనాలను నిర్మించారు. రూ.24.68 కోట్లతో ఆదివాసీ భవన్‌ (Adivasi Bhavan)‌ను, రూ.24.43 కోట్లతో బంజారా భవనాన్ని నిర్మించినట్లు ఈ సందర్భంగా కేసీఆర్ (Telangana CM KCR) అన్నారు. కాగా.. బంజారా, ఆదివాసీ భవన్ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కొత్తగా కట్టిన బంజారా, ఆదివాసీ భవన్‌లను బంజారా ఆదివాసీ సంఘాల నాయకులు ముట్టడించారు.


Updated Date - 2022-09-17T19:39:00+05:30 IST