Supreme court: టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్‌కు సుప్రీంలో చుక్కెదురు

ABN , First Publish Date - 2022-09-28T19:26:37+05:30 IST

టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. బీబీ పాటిల్ ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై పునఃపరిశీలన జరపాలని తెలంగాణ హైకోర్టుకు సుప్రీం సూచించింది.

Supreme court: టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్‌కు సుప్రీంలో చుక్కెదురు

న్యూఢిల్లీ: టీఆర్ఎస్ ఎంపీ (TRS MP) బీబీ పాటిల్‌ (BB Patil)కు సుప్రీంకోర్టు (Supreme court)లో చుక్కెదురైంది. బీబీ పాటిల్ ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై పునఃపరిశీలన జరపాలని తెలంగాణ హైకోర్టు (Telangana high court)కు సుప్రీం సూచించింది. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం పొందుపరిచారని తెలంగాణ హైకోర్టులో ప్రత్యర్థి మదన్‌మోహన్‌రెడ్డి (Madan mohan reddy) సవాల్ చేశారు. కాగా... మదన్‌మోహన్‌ పిటిషన్‌ను హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ అభిషేక్‌రెడ్డి తోసిపుచ్చారు. దీంతో హైకోర్టు ఉత్తర్వులను మదన్‌మోహన్‌రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ క్రమంలో సింగిల్ జడ్జి తీర్పుపై పునఃపరిశీలన చేయాలంటూ ఉన్నతన్యాయస్థానం సూచనలు చేసింది. అక్టోబర్ 10న హైకోర్టుకు హాజరుకావాలని తీర్పులో పేర్కొంది. ఈ కేసులో అన్ని అంశాలు ఓపెన్‌గానే ఉంటాయని తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టం  చేసింది. 

Updated Date - 2022-09-28T19:26:37+05:30 IST