జూబ్లీహిల్స్ ఘటన బాధాకరం: Vivekananda goud

ABN , First Publish Date - 2022-06-07T19:13:23+05:30 IST

జూబ్లీహిల్స్ ఘటన బాధాకరమని ఎమ్మెల్యే వివేకానందగౌడ్ అన్నారు.

జూబ్లీహిల్స్ ఘటన బాధాకరం: Vivekananda goud

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఘటన బాధాకరమని ఎమ్మెల్యే వివేకానందగౌడ్(Vivekananda goud) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... రఘునందన్ వ్యక్తిగత ఇమేజ్‌ను పెంచుకునే ప్రయత్నం చేశారని వ్యాఖ్యానించారు. ఆధారాలు ఉంటే కోర్టుకు సబ్మిట్ చేయాలని సూచించారు. బీజేపీకి ఏ అంశం దొరికినా రాజకీయం చేస్తోందని విమర్శించారు. కేంద్ర పెద్దలు అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. పిచ్చోడి చేతిలో రాయిలా బండి సంజయ్ మారారని తెలిపారు. బండి సంజయ్ స్టేట్‌మెంట్స్ పార్టీవా? వ్యక్తిగతమా అని ఎమ్మెల్యే వివేకానందగౌడ్ ప్రశ్నించారు. 

Read more