తరుణ్ చుగ్ ఇంట గెలిచి రచ్చ గెలవాలి: ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

ABN , First Publish Date - 2022-02-23T23:34:02+05:30 IST

బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జి తరుణ్ చుగ్ ఇంట గెలిచి రచ్చ గెలవాలని టీఆర్‌ఎస్

తరుణ్ చుగ్ ఇంట గెలిచి రచ్చ గెలవాలి: ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

నిజామాబాద్: బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జి తరుణ్ చుగ్ ఇంట గెలిచి రచ్చ గెలవాలని టీఆర్‌ఎస్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి  అన్నారు. నగరంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్త ప్రెస్‌మీట్ నిర్వహించి మాట్లాడారు. ఢిల్లీలో మాట్లాడటం కాదని ఇక్కడ వచ్చి మాట్లాడాలని ఆయన సవాల్ విసిరారు. దేశానికి, రాష్ట్రానికి బీజేపీ ఒక శని లాగా మారిందన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధిపై తాను శ్వేతా పత్రం రీలిజ్ చేస్తున్నానన్నారు. వందల కోట్ల రూపాయలు సంక్షేమం కోసం ఖర్చు చేశామన్నారు. నిజామాబాద్ అర్బన్ బ్యూటిఫికేషన్‌లో తెలంగాణాలో నంబర్‌వన్ అని ఆయన తెలిపారు.  నిజామాబాద్ ఎంపీ  బ్రెయిన్‌లెస్ ఎంపీ అని  అరవింద్‌పై విరుచుకు పడ్డారు. ఏమైనా అంటే ప్రివిలేజ్ మోషన్ అంటున్నారని, పేపర్లలలో రాస్తే పత్రికలకు ప్రివిలేజ్ మోషన్ అంటున్నారన్నారు. దాన్ని ఖండిస్తున్నామన్నారు. నిజామాబాద్ ఎంపీని ప్రతి గ్రామంలో అడ్డుకుంటామని ఆయన పేర్కొన్నారు. 


నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్  గుప్తా మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటుపై ప్రదాని వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. రెండు రాష్ట్రాలకు కొట్లాట పెట్టే ప్రయత్నాలను బీజేపీ చేస్తుందని ఆయన ఆరోపించారు. నిజామాబాద్ అభివృద్ధి పై ఏలాంటి ఛాలెంజ్ కైనా రెడీ అని ఆయన సవాల్ విసిరారు. 


Read more