ప్రాణదాత డాక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి బదిలీ

ABN , First Publish Date - 2022-06-12T08:52:58+05:30 IST

కొవిడ్‌ సమయాన గాంధీ ఆస్పత్రిలో విధి నిర్వహణలో అంకితభావంతో పని చేసి, వందలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్‌

ప్రాణదాత డాక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి బదిలీ

ఆసిఫాబాద్‌ డీఎంహెచ్‌ఓ ఆఫీసుకు..  


అడ్డగుట్ట, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ సమయాన గాంధీ ఆస్పత్రిలో విధి నిర్వహణలో అంకితభావంతో పని చేసి, వందలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి బదిలీ అయ్యారు. ఆయనను ఆసిఫాబాద్‌ డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ప్రోగ్రాం ఆఫీసర్‌గా నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. గాంధీ ఆస్పత్రిలో డాక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి ఐదేళ్ల పాటు ఆర్‌ఎంఓగా విధులు నిర్వహించారు. 2020-21 కరోనా సమయంలో ఆయనను గాంధీ ఆస్పత్రికి కొవిడ్‌ నోడల్‌ అధికారిగా ప్రభుత్వం నియమించింది. రెండేళ్ల కాలంలో ఏడాది పాటు ఇంటికి వెళ్లకుండా ఆస్పత్రిలోనే ఉంటూ ఇరవై నాలుగు గంటలు కొవిడ్‌ రోగులకు వైద్య సేవలందించారు. ఈ క్రమంలో వందలాది మంది రోగుల ప్రాణాలు నిలిపారు. 

Read more