రేపు సైబరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

ABN , First Publish Date - 2022-09-24T12:45:00+05:30 IST

ఈ నెల 25న గ్యాథరింగ్‌ సైక్లింగ్‌ కమ్యూనిటీ మారథాన్‌ సందర్భంగా సైబరాబాద్‌లో ఉదయం 5 నుంచి 8 గంటల వర కు ట్రాఫిక్‌ ఆంక్షలు

రేపు సైబరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌ సిటీ: ఈ నెల 25న గ్యాథరింగ్‌ సైక్లింగ్‌ కమ్యూనిటీ మారథాన్‌ సందర్భంగా సైబరాబాద్‌లో ఉదయం 5 నుంచి 8 గంటల వర కు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్‌ డీసీపీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. సుమారు వెయ్యి మంది సైక్లిస్టులు కేబుల్‌ బ్రిడ్జిపై హాజరవుతారని సైక్లింగ్‌ సంఘం నిర్వాహకులు పేర్కొన్నారు. సైక్లింగ్‌ నేపథ్యంలో ఐటీసీ కోహినూర్‌, ఐకియా, రోటరీ, కేబుల్‌ బ్రిడ్జి, ఎన్‌సీబీ జంక్షన్‌, గచ్చిబౌలి రోడ్డు నంబర్‌-45, దుర్గంచెరువు, జూబ్లీహిల్స్‌ ఇనార్బిట్‌ మాల్‌, సీవోడీ జంక్షన్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు ఉంటాయని డీసీపీ పేర్కొన్నారు. ఉదయం 8 గంటల తర్వాత డైవర్షన్స్‌ తీసివేసి ట్రాఫిక్‌ యధావిధిగా కొనసాగిస్తామన్నారు. 

Read more