వైద్యశాఖపై ఆర్డీవోల పెత్తనాన్ని సహించం

ABN , First Publish Date - 2022-04-10T07:34:03+05:30 IST

వైద్య, ఆరోగ్యశాఖపై రెవెన్యూ అధికారుల పెత్తనాన్ని సహించేది

వైద్యశాఖపై ఆర్డీవోల పెత్తనాన్ని సహించం

  •  ప్రైవేటు ప్రాక్టీస్‌ నిషేధాన్ని పునరాలోచించుకోవాలి
  •  తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం హెచ్చరిక 


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 9 (ఆంఽధ్రజ్యోతి) : వైద్య, ఆరోగ్యశాఖపై రెవెన్యూ అధికారుల పెత్తనాన్ని సహించేది లేదని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని  హెచ్చరించింది. ఆస్పత్రులపై ఆర్డీవోల పర్యవేక్షణ చేయబోవడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు సంఘం డీహెచ్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లాలూ ప్రసాద్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆర్డీవోలను పర్యవేక్షణాధికారులుగా నియమించే యోచనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు.


ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ప్రాక్టీస్‌ చేయడాన్ని నిషేధించాలన్న ఆలోచనను సర్కారు పునరాలోచించుకోవాలని కోరారు. సంఘం లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు డాక్టర్‌ పల్లం ప్రవీణ్‌ మాట్లాడుతూ.. డ్యూటీ సమయం తర్వాత ప్రైవేటు ప్రాక్టీస్‌ చేయడం తప్పు అనడం సమంజసం కాదన్నారు. ఆ పేరుతో వైద్యులను కట్టడి చేయడం సరికాదన్నారు. జీవో నంబరు 119 ప్రకారం ప్రైవేటు ప్రాక్టీసు చేసుకునే వెసులుబాటు ఉందని అన్నారు. 


Read more