నేడు జార్ఖండ్‌కు సీఎం కేసీఆర్‌

ABN , First Publish Date - 2022-03-04T07:44:07+05:30 IST

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌ శుక్రవారం అక్కడనుంచి జార్ఖండ్‌ వెళ్లనున్నారు.

నేడు జార్ఖండ్‌కు సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌/ ఢిల్లీ, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ పర్యటనలో ఉన్న  సీఎం కేసీఆర్‌ శుక్రవారం అక్కడనుంచి జార్ఖండ్‌ వెళ్లనున్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు గల్వాన్‌ అమర వీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించనున్నారు. జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌తో కలిసి ఆ రాష్ట్రానికి చెందిన ఇద్దరు అమర జవాన్ల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేయనున్నారు. కాగా, ఈ పర్యటన సందర్భంగా ప్రాంతీయ పార్టీలతో జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ ఫ్రంట్‌ ఏర్పాటు విషయంపై జార్ఖండ్‌ ముఖ్యమంత్రి సోరెన్‌తో కేసీఆర్‌ చర్చిస్తారని టీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి. సొరెన్‌తో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత హైదరాబాద్‌కు తిరిగి వస్తారు. మరోవైపు, కేసీఆర్‌ మార్చి 14 తర్వాత ఢిల్లీ వచ్చి ప్రాంతీయ పార్టీల అధినేతల సమావేశంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Read more