రిమాండ్‌కు పంపిస్తామని బెదిరించారు

ABN , First Publish Date - 2022-10-12T09:50:27+05:30 IST

పేస్కేల్‌ జీవో అమ లు, అర్హులైనవారికి ప్రమోషన్లు తదితర డిమాం డ్లు, సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వీఆర్‌ఏలు మంగళవారం ఇందిరాపార్క్‌కు తరలివచ్చారు.

రిమాండ్‌కు పంపిస్తామని బెదిరించారు

  • పిల్లలు ఎదురు చూస్తారన్నా కనికరించలేదు..
  • అరెస్టులపై మహిళా వీఆర్‌ఏల ఆవేదన
  • ఇందిరాపార్క్‌ వద్ద వీఆర్‌ఏల ధర్నా
  • రాత్రి 10 గంటల దాకా అదుపులోనే

చిక్కడపల్లి/హైదరాబాద్‌/మానకొండూరు, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): పేస్కేల్‌ జీవో అమ లు, అర్హులైనవారికి ప్రమోషన్లు తదితర డిమాం డ్లు, సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వీఆర్‌ఏలు మంగళవారం ఇందిరాపార్క్‌కు తరలివచ్చారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. మహిళా వీఆర్‌ఏలు బతుకమ్మ ఆడి నిరసన తెలియజేశారు. జిల్లాల నుంచి ధర్నాచౌక్‌కు తరలివస్తున్న పలువురు వీఆర్‌ఏలను చిక్కడపల్లి పోలీసులు ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో వీఆర్‌ఏ జేఏసీ కో-కన్వీన ర్లు శిరీష రెడ్డి, సునీత, వంగూరు రాములు కూ డా ఉన్నారు. ఇద్దరు మహిళా వీఆర్‌ఏలు ఉన్నా రాత్రి పొద్దు పోయే వరకు వారిని పోలీస్‌ స్టేషన్‌లోనే ఉంచడం చర్చనీయాంశం అయింది. మరోవైపు, ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లో ఆందోళన నిర్వహిస్తు న్న మహిళా వీఆర్‌ఏలను పోలీసులు అరెస్టు చేసి ముషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ను తరలించా రు. శిరీష, సునీత మాట్లాడుతూ.. ‘చాలా దూరం నుంచి వచ్చాం. ఇంటి దగ్గర పిల్లలు ఎదురు చూ స్తారు. వదిలేయండి. అని కోరితే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామని, రిమాండ్‌కు తరలిస్తామని పోలీసులు బెదిరిస్తున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. పై అధికారుల ఆదేశాలు వస్తేనే వదిలిపెడతామని పోలీసులు చెప్పినట్లు పేర్కొన్నారు.  


అరెస్టులు అన్యాయం: వీఆర్‌ఏల జేఏసీ 

న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరసన తెలుపుతున్న వీఆర్‌ఏలను అరెస్ట్‌ చేయడం అన్యాయమని వీఆర్‌ఏ జేఏసీ కన్వీనర్‌ గోవింద్‌ పేర్కొన్నారు. పోలీసుల చర్యను ఖండిస్తూ మంగళవారం ప్రకటన విడుదల చేశారు. మహిళా వీఆర్‌ఏలపై పోలీసులు నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించడమే కాకుండా రాత్రి కూడా పోలీ్‌సస్టేషన్‌లో ఉంచడం దారుణమన్నారు. 


గుండెపోటుతో వీఆర్‌ఏ మృతి

కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ మండలంలోని ఊటూర్‌కు చెందిన వీఆర్‌ఏ మోతె కొమురయ్య(45) గుండెపోటుతో మంగళవారం చనిపోయాడు. తమ సమస్యల పరిష్కారం కోసం వీఆర్‌ఏలు 79 రోజులుగా కరీంనగర్‌ కలెక్టరేట్‌ ఎదురుగా ధర్నా చేస్తున్నారు. కొమురయ్య కూడా ధ ర్నాలో పాల్గొంటున్నాడు.  సోమవారం కొమురయ్యకు గుండెపోటు రావడంతో కరీంనగర్‌ ఆస్పత్రికి తరలిం చడి అక్కడ మృతి చెందాడు.

Updated Date - 2022-10-12T09:50:27+05:30 IST