శిష్యులమని నమ్మించి.. రిటైర్డ్ ఉపాధ్యాయుడితో ఫుల్లుగా తాగించి..

ABN , First Publish Date - 2022-09-29T15:25:36+05:30 IST

శిష్యుల పేరుతో ఉపాధ్యాయుడికి టోకరా వేశారు. సంగారెడ్డికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు లక్ష్మీనారాయణ ఇంట్లో భారీ చోరీకి పాల్పడ్డారు.

శిష్యులమని నమ్మించి.. రిటైర్డ్ ఉపాధ్యాయుడితో ఫుల్లుగా తాగించి..

సంగారెడ్డి : శిష్యుల పేరుతో ఉపాధ్యాయుడికి టోకరా వేశారు. సంగారెడ్డికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు లక్ష్మీనారాయణ ఇంట్లో భారీ చోరీకి పాల్పడ్డారు. ఈ నెల 24వ తేదీ సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. రూ.30 లక్షల నగదు, 10 తులాల బంగారాన్ని ఇద్దరు గుర్తు తెలియని యువకులు చోరీ చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా జోగిపేట పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తమను సదరు ఉపాధ్యాయుడికి స్టూడెంట్స్‌గా పరిచయం చేసుకున్న యువకులు ఆయనను మాటలతో నమ్మించారు. మందు పార్టీ పేరుతో ఆయనతో ఫుల్లుగా తాగించారు. ఇంకా వైన్ షాపు నుంచి మద్యం తెస్తామని ఉపాధ్యాయుడికి చెప్పి ఇంట్లో ఉన్న నగదు, బంగారంతో బైక్‌పై పరారయ్యారు. 

Read more