నలుగురు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

ABN , First Publish Date - 2022-01-28T08:48:36+05:30 IST

స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కసిరెడ్డి నారాయణరెడ్డి (మహబూబ్‌నగర్‌), ఎల్‌.రమణ (కరీంనగర్‌), పట్నం మహేందర్‌రెడ్డి (రంగారెడ్డి), యాదవరెడ్డి (మెదక్‌) ప్రమాణస్వీకారం చేశారు.

నలుగురు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

హైదరాబాద్‌, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీలుగా  ఎన్నికైన కసిరెడ్డి నారాయణరెడ్డి (మహబూబ్‌నగర్‌), ఎల్‌.రమణ (కరీంనగర్‌), పట్నం మహేందర్‌రెడ్డి (రంగారెడ్డి), యాదవరెడ్డి (మెదక్‌) ప్రమాణస్వీకారం చేశారు. శాసన మండలి చైర్మన్‌ చాంబర్‌లో మండలి ప్రొటెం చైర్మన్‌ అమిణుల్‌ హాసన్‌ జాఫ్రీ గురువారం వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యకమంలో మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, మహమూద్‌ అలీ,  కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read more