గ్రామ కార్యదర్శుల ఆత్మహత్యలు బాధాకరం

ABN , First Publish Date - 2022-02-19T07:34:26+05:30 IST

గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఆత్మహత్యలకు పాల్పడటం

గ్రామ కార్యదర్శుల ఆత్మహత్యలు బాధాకరం

బండి సంజయ్‌


హైదరాబాద్‌, పిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరమని, వారికి మనోధైర్యం కల్పించడంపై ప్రభుత్వ దృష్టిపెట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సీఎం కేసీఆర్‌కు శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. గ్రామాల అభివృద్ధిలో వారి పాత్ర పోషిస్తున్నా, ఉన్నతాధికారుల నుంచి బెదిరింపులు తప్పడం లేదని ఆరోపించారు. కొన్ని చోట్ల  భౌతిక దాడులు జరుగుతున్నాయని దీంతో తీవ్ర మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. 


Read more