ధనవంతులుగా మారడం ఎలాగో చెబుతూనే.. చివరకు క్యాష్ బ్యాక్ ఆఫర్లతో..

ABN , First Publish Date - 2022-12-09T21:36:11+05:30 IST

కోటీశ్వరులు కావాలని అనుకునే పేద, మధ్య తరగతి ప్రజలే వారి టార్గెట్. ఆకర్షించే ప్రకటనలు ఇచ్చి, తీయని మాటలతో అమాయకులను నమ్మిస్తారు. వీరి మాటలు నమ్మి వచ్చిన వారిని..

ధనవంతులుగా మారడం ఎలాగో చెబుతూనే.. చివరకు క్యాష్ బ్యాక్ ఆఫర్లతో..

హైదరాబాద్‌: కోటీశ్వరులు కావాలని అనుకునే పేద, మధ్య తరగతి ప్రజలే వారి టార్గెట్. ఆకర్షించే ప్రకటనలు ఇచ్చి, తీయని మాటలతో అమాయకులను నమ్మిస్తారు. వీరి మాటలు నమ్మి వచ్చిన వారిని పెట్టుబడి పేరుతో కోట్లు కొళ్లకొడతారు. ధనవంతులుగా మారడం ఎలాగో వివరిస్తూ.. చివరకు వారి నుంచే డబ్బులు దండుకున్నారు. వెల్‌విజన్ పేరుతో ప్రజలను అడ్డంగా మోసం చేస్తున్న వైనం.. ఏబీఎన్ క్రైమ్ స్టింగ్ ఆపరేషన్‌తో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..

PhonePe, Google Pay ద్వారా పొరపాటున వేరేవాళ్లకు పంపిన డబ్బులు వెనక్కు తెప్పించాలంటే..

హైదరాబాద్‌లోని (Hyderabad) కూకట్‌పల్లిలో వెల్‌విజన్ బ్రాండ్ పేరుతో కందుల శ్రీనివాసరావ్ అనే వ్యక్తి ఓ సంస్థను నడుపుతున్నాడు. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో సొంత అవుట్‌లెట్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. తమ వద్ద ఏ వస్తువు కొన్నా వంద శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ (Cash back offer) ఇస్తామంటూ ప్రకటించారు. నెలకు ఐదు శాతం చొప్పున 22నెలల్లో మొత్తం డబ్బులను వెనక్కు ఇస్తేస్తామని నమ్మించారు. వెల్‌విజన్ పేరుతో ఏర్పాటైన ఈ సంస్థ పేరుతో కేవల గ్రహోపకరణాలే (Household appliances) కాకుండా రియల్‌ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నారు.

కళాశాల వద్ద అదే పనిగా తిరుగుతున్న యువకులు.. అనుమానం వచ్చి బ్యాగుల్లో తనిఖీ చేయగా..

మరోవైపు అతి తక్కువ కాలంలో ధనవంతులుగా మారడం ఎలా అని వివరిస్తూ.. ప్రజల నుంచి డిపాజిట్లు కూడా సేకరించారు. ఇలా రకరకాల స్కీమ్‌లతో జనాలను బురిడీ కొట్టించారు. గృహోపకరణాల ప్రాంచైజీ పేరుతో ఒక్కొక్కరి నుంచి సమారు రూ.3లక్షల మేర డిపాజిట్ చేయించుకున్నాడు. ఇలా చాలా మందిని తన సంస్థల్లో మేనేజర్లుగా నియమించుకుని, తక్కువ ధరకు కొనుగోలు చేసిన నాసిరకం టీవీలు, ఫ్రిడ్జ్‌లను స్టోర్‌లో అమ్మాకానికి పెట్టాడు. చివరకు ఏబీఎన్ క్రైమ్ స్టింగ్ ఆపరేషన్‌లో శ్రీనివాసరావు అడ్డంగా దొరికాడు.

రెండో సారి శృంగారానికి సిద్ధపడ్డ భర్త.. అయితే భార్య సమాధానంతో చివరకు.. తమ్ముడి సాయం తీసుకుని మరీ..

Updated Date - 2022-12-09T21:36:16+05:30 IST