ఆ పరికరాలను స్ట్టెరిలైజ్‌ చేయలేదు..

ABN , First Publish Date - 2022-09-08T09:13:25+05:30 IST

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని సివిల్‌ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ఘటనలో నలుగురు మహిళల మరణాలపై సర్కారుకు నివేదిక అందింది.

ఆ పరికరాలను స్ట్టెరిలైజ్‌ చేయలేదు..

  • అందుకే నలుగురు మహిళల మరణం!
  • కు.ని ఘటనపై సర్కారుకు నివేదిక 
  • డాక్టర్లు, సిబ్బంది సహా 
  • 30 మందిపై చర్యలకు సిఫారసు!
  • రెండు రోజుల్లో నివేదికను వెల్లడించే అవకాశం


హైదరాబాద్‌, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని సివిల్‌ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ఘటనలో నలుగురు మహిళల మరణాలపై సర్కారుకు నివేదిక అందింది. ఈ మేరకు బుధవారం ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు నేతృత్వంలోని కమిటీ ప్రభుత్వానికి నివేదిక పంపింది. ఆస్పత్రిలో ఆపరేషన్‌ జరగడానికి ముందు, ఆ తర్వాత జరిగిన పరిణామాలకు సంబంధించి పూర్తి వివరాలను నివేదికలో పొందుపర్చింది. గత నెల 25న డీపీఎల్‌ క్యాంపులో పాల్గొన్న డాక్టర్లు, సిబ్బంది సహా సుమారు 30 మందిపై చర్యలకు సిఫారసు చేసినట్టు తెలిసింది. ఆపరేషన్‌ థియేటర్‌లో ఉన్న ఎక్వి్‌పమెంట్‌, డీపీఎల్‌ సర్జరీల కోసం డాక్టర్‌ జోయల్‌ టీమ్‌ తీసుకొచ్చిన పరికరాలను స్టెరిలైజేషన్‌ చేయకపోవడం వల్లే మహిళలంతా ఇన్ఫెక్షన్‌కు గురయ్యారని, నలుగురు చనిపోయారని కమిటీ పేర్కొన్నట్లు సమాచారం. కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలను ఒకట్రెండు రోజుల్లో మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది.

Read more