చేపలు పట్టేందుకు వెళ్లి బాలుడి మృతి

ABN , First Publish Date - 2022-10-12T05:20:19+05:30 IST

చేపలు పట్టేందుకు వెళ్లి బాలుడి మృతి

చేపలు పట్టేందుకు వెళ్లి బాలుడి మృతి

వాజేడు, అక్టోబరు 11: చేపలు పట్టేందుకు వెళ్లిన బాలుడు చెరువులో గల్లంతై మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. 

మండల కేంద్రంలోని జంగాలపల్లికి చెందిన వ్యవసా య కూలీలు గణపురం సతీష్‌, నీలమ్మ  దంపతుల పెద్ద కుమారుడు అఖిల్‌ (12) గోవిందరావుపేట మం డలం పస్రాలోని  ఆశ్రమ పాఠశాలలో ఏడో తరగతి చదువుతు న్నాడు. దసరా సెలవులకు ఇంటికి వచ్చాడు. సెలవులు ముగిసినా ఇంకా పాఠశాలకు వెళ్లలేదు. ఈ క్రమంలో చేపలు పట్టేం దుకు  గ్రామ శివారులోని కుమ్మరికుంట చెరువు వద్దకు మంగళవార మధ్యాహ్నం వెళ్లాడు. ప్రమా దవశాత్తు నీట మునిగాడు. అదే సమయంలో గేదెలు కాస్తున్న వ్యక్తి ఈ దృశ్యా న్ని చూసి కుటుంబ సభ్యు లకు సమాచా రం అందించా డు. దీంతో అక్క డికి చేరుకున్న కుటుంబ సభ్యు లు, గ్రామస్థులు బాలుడి ఆచూకీ కోసం గాలించ గా సాయంత్రం బాలుడి మృతదేహం లభ్యమైంది.

Read more