పోలీసు ఉద్యోగార్థుల వయోపరిమితి పెంచాలి

ABN , First Publish Date - 2022-05-18T09:42:33+05:30 IST

పోలీసు ఉద్యోగాల భర్తీలో అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిని ఐదేళ్లు సడలించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

పోలీసు ఉద్యోగార్థుల వయోపరిమితి పెంచాలి

సీఎం కేసీఆర్‌కు రేవంత్‌ బహిరంగ లేఖ 

హైదరాబాద్‌, మే 17(ఆంధ్రజ్యోతి): పోలీసు ఉద్యోగాల భర్తీలో అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిని ఐదేళ్లు సడలించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు మంగళవారం ఆయన లేఖ రాశారు. ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్‌లో వయోపరిమితి సడలింపు  మూడేళ్లు మాత్రమే చేశారని, దీనివల్ల 4లక్షల మంది  నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. ఉద్యోగార్థులు కోరుతున్న విధంగా వయో పరిమతిని సడలించకుంటే కాంగ్రెస్‌ పార్టీ తరపున ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు. ధాన్యం కుప్పల దగ్గర రైతులు పడిగాపులు పడుతుంటే.. సీఎం కేసీఆర్‌ ఫాం హౌస్‌లో కుంభకర్ణుడిలా 16 రోజులు సేదతీరి వచ్చారంటూ రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. సీఎంకు రైతులే కర్రు కాల్చి వాతపెడతారని మంగళవారం ట్వీట్‌ చేశారు. 

Read more