వివరాలు చెప్పారో ఖాతా ఖాళీ

ABN , First Publish Date - 2022-11-21T01:23:28+05:30 IST

నేటి ఆధునిక టెక్నాలజీ యుగంలో డబ్బును ఈజీగా సంపాదించేందుకు పలు రకాల మోసా లు జరుగుతున్నాయి. గతంలో ఇళ్లలో చొరబడి చోరీలకు పాల్పడి నగదు, బంగారు అభరణాల ను దోచుకెళ్లేవారు. ఇప్పుడు నేరగాళ్ల పంథా మారింది. సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించి టెక్నాలజీని ఉపయోగించి సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు. క్షణాల్లో బ్యాంకు ఖాతాల్లోంచి డబ్బు మాయం చేస్తున్నారు.

వివరాలు చెప్పారో ఖాతా ఖాళీ

జిల్లాలో ఇప్పటికే పలువురు బాధితులు

మూడేళ్లలో 786 ఫిర్యాదులు

మోసానికి గురైతే టోల్‌ఫ్రీ నెంబరు1930 ఫిర్యాదు చేయొచ్చు

సూర్యాపేటక్రైం: నేటి ఆధునిక టెక్నాలజీ యుగంలో డబ్బును ఈజీగా సంపాదించేందుకు పలు రకాల మోసా లు జరుగుతున్నాయి. గతంలో ఇళ్లలో చొరబడి చోరీలకు పాల్పడి నగదు, బంగారు అభరణాల ను దోచుకెళ్లేవారు. ఇప్పుడు నేరగాళ్ల పంథా మారింది. సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించి టెక్నాలజీని ఉపయోగించి సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు. క్షణాల్లో బ్యాంకు ఖాతాల్లోంచి డబ్బు మాయం చేస్తున్నారు. ఎక్కడో ఉండి ఫోన్లు చేసి, మెసెజ్‌లు పంపి మాయ మాటలతో వ్యక్తిగత, బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకుంటున్నారు. మోసాన్ని గ్రహించేలోగా బ్యాంకు ఖా తా నుంచి డబ్బును నేరగాళ్లు సొంత ఖాతాల్లోకి తరలిస్తున్నారు. ఇలాంటి సైబర్‌ నేరాలు ప్రస్తు తం పెరిగాయి. ఇలాంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని పోలీస్‌ అధికారులు సూచిస్తున్నారు.

సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన ఉన్నవారు తప్పుడు చిరునామాలతో సెల్‌ఫోన్‌ సిమ్‌ కార్డులు కొనుగోలు చేస్తున్నా రు. అంతేగాక కొత్త కొత్త మెయిల్‌ అడ్ర్‌సలు, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం, ట్విట్టర్‌ అకౌంట్లు సృష్టించి సాంకేతికత ఆధారంగా నేరాలకు పాల్పడుతున్నారు. అమాయక ప్రజలతో పాటు ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు, ఉద్యోగులు సైతం వీరిబారి న పడుతున్నారు. తాము బ్యాంక్‌కు అధికారులమంటూ, కస్టమర్‌ కేర్‌ నుంచి మాట్లాడుతున్నామంటూ వ్యక్తిగత, బ్యాంకు ఖాతా, ఇతర సమాచారాన్ని సేకరించి డబ్బు దోచుకుంటున్నా రు. లాటరీలో బహుమతి వచ్చిందని, తక్కువ వడ్డీకి లోన్లు ఇప్పిస్తామని, సెల్‌ టవర్లు ఏర్పాటు చేస్తామని, నగదు డిపాజి ట్‌ చేస్తే రెండితల వడ్డీ వస్తుందని నమ్మబలికి బ్యాంకు ఖాతా, ఏటీఎం, డెబిట్‌, క్రేడిట్‌ కార్డుల వివరాలు, పాస్‌వర్డ్‌, బ్యాంకు ఓటీపీ తెలుసుకుంటున్నారు. వాటి ద్వారా బ్యాంకు ఖాతాల్లో నిల్వ ఉన్న నగదును ఆన్‌లైన్‌లో కాజేస్తున్నారు. అంతేగాక ఆన్‌లైన్‌ షాపింగ్‌, అమ్మకాల పేరుతో కూడా ఇటీవల మోసా లు అధికమయ్యాయి. ఇలాంటి సంఘటనలు అధికంగా బ్యాం కు సెలవులకు ముందు జరుగుతున్నట్లు పోలీసు అధికారులు గుర్తించారు. ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తులు సెల్‌ఫోన్‌కు, మెయుల్‌ అడ్ర్‌సకు మెసెజ్‌ పంపితే స్పందించవద్దని పోలీసులు చెబుతున్నారు. కొందరు ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల పేర్లు ట్రూకాలర్‌లో కనిపించేలా కొత్త నంబర్ల నుంచి ఫోన్‌చేసి డబ్బు అవసరం ఉంది పంపాలని అడుగుతున్నారు. అదేవిధంగా ఫేస్‌బుక్‌ అకౌంట్‌నుంచి సైతం డబ్బు పంపించాల్సిందిగా కోరుతున్నారు. ఇలా మెసేజ్‌ వస్తే అసలు వ్యక్తులకు ఫోన్‌చేసి నిర్ధారించుకోవాలి.

786 ఫిర్యాదులు

జిల్లా పరిధిలో గడిచిన మూడేళ్లలో పోలీసులకు సైబర్‌ నేరాలకు సంబంధించి 786 ఫిర్యాదులు అందాయి. 2020లో 85, 2021లో 264 ఫిర్యాదు లు వచ్చాయి. కాగా ఈ ఏడాది ఇప్పటి వరకు 445 ఫిర్యాదులు పో లీసులకు అందాయి. మూడేళ్లలో పోలీసులు ఇప్పటి వరకు 410 కేసులను చే ధించి బాధితులకు న్యాయం చేశారు. ఇంకా మిగిలిన ఫిర్యాదులకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. మోసం జరగ్గానే వెంటనే ఫిర్యాదు చేస్తే డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. ఆలస్యం చేస్తే ఆ డబ్బుపై ఆశ వదులుకోవాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

నేరగాళ్లబారిన పలువురు

కోదాడ మండలానికి చెంది న ఓ వ్యక్తికి బ్యాంకు ప్రధాన కార్యాలయం నుంచి మట్లాడుతున్నానని చెప్పి ఆధార్‌, ఏటీఎం కార్డు నంబరు అడిగి దాని ద్వారా ఓటీపీ తెలుసుకొని రూ.45వేలు కాజేశాడు.

సూర్యాపేట మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు కెనరా బ్యాంకు మేనేజర్‌ను అంటూ ఫోన్‌చేసి బ్యాంకు ఖాతాకు ఆధార్‌ నెంబర్‌ లింకేజీ చేయాలని చెప్పి ఆధార్‌ నెంబర్‌ తెలుసుకున్నాడు. దాని ద్వారా రూ.90వేలు ఆన్‌లైన్‌ ద్వారా డ్రాచేశాడు.

చింతలపాలెం మండలానికి చెంది న ఓ వ్యక్తికి ఓ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి చెందిన అధికారిని మాట్లాడుతున్నానని చెప్పి సుమారు రూ.4.50లక్ష లు, ఒక ఐఫోన్‌ బహుమతి వచ్చిందని అవి రావాలంటే కొరియర్‌, ప్రాసెసింగ్‌ చార్జీ చెల్లించాల్సి ఉందని నమ్మబలికాడు. అది నమ్మిన బాధితుడు నేరగాడి ఖాతాలో రూ.90వేలు జమచేశాడు. ఆ తర్వాత సదరు నంబరు ఫోన్‌చేయగా స్విచ్చాఫ్‌ వచ్చింది.

ఇటీవల కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌ పేరుతో డీఎంహెచ్‌వో డాక్టర్‌ కోటా చలాని మెసే జ్‌ రాగా, అది నమ్మిన ఆయన అమెజాన్‌పే ద్వారా లక్ష రూపాయల వరకు ట్రాన్స్‌ఫర్‌ చేశారు. ఆ తరువాత కూడా నేరగాళ్లు డబ్బు అడగడంతో అనుమానం వచ్చి పరిశీలించగా మోసానికి గురైనట్లు గుర్తించారు.

అపరిచితులకు సమాచారం ఇవ్వొద్దు : ఎస్‌.రాజేంద్రప్రసాద్‌, ఎస్పీ

గుర్తుతెలియని వ్యక్తులకు వ్యక్తిగత, బ్యాంకు ఖాతా సమాచారం ఎట్టి పరిస్థితుల్లో చెప్పవద్దు. వాటి ద్వారా కొంత మంది సైబర్‌ నేరగాళ్లు డబ్బు దండుకుంటున్నారు. ఈ విధంగా ఎవరైనా మోసపోతే 24గంటల్లోగా పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. అదే విధంగా టోల్‌ఫ్రీ నెంబరు 1930కి, సైబర్‌ల్యాబ్‌ సెల్‌ 8331940276, వాట్సాప్‌ నెంబరు 9390564900కు కూడా ఫిర్యాదు చేయవచ్చు.

Updated Date - 2022-11-21T01:23:30+05:30 IST