ఖర్గేకి టీ కాంగ్రెస్ మద్దతు.. సడెన్‌గా థరూర్ హైదరాబాద్‌లో ప్రత్యక్షం

ABN , First Publish Date - 2022-10-03T17:04:03+05:30 IST

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) సమీప బంధువు మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసిన

ఖర్గేకి టీ కాంగ్రెస్ మద్దతు.. సడెన్‌గా థరూర్ హైదరాబాద్‌లో ప్రత్యక్షం

హైదరాబాద్ : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) సమీప బంధువు మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసిన కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థి శశి థరూర్ (Shashi Tharoor) ఆ కొద్ది సేపటికే షాక్ ఇచ్చారు. సడెన్‌గా ఎలాంటి సమాచారమూ లేకుండా ఆయన హైదరాబాద్‌ (Hyderabad)లో ప్రత్యక్షమయ్యారు. ఈ రోజు ప్రచారం కోసం శశిథరూర్ హైదరాబాద్ వచ్చారు. కాంగ్రెస్ నేతల (Congress leaders)కు కనీస సమాచారం ఇవ్వకుండానే ఆయన హైదరాబాద్‌లో ప్రత్యక్షమయ్యారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ ఖర్గే (Kharge)కి మద్దతుగా నిలుస్తోంది. ఇప్పటికే కొందరు నేతలు ఖర్గే అధ్యక్షుడు అయిపోయినట్టేనని భావిస్తూ ఆయనకు శుభాకాంక్షలు కూడా చెప్పారు. మరోసారి రేవంత్‌ను కలుస్తానని తన ట్వీట్‌లో శశిథరూర్ పేర్కొన్నారు. ప్రస్తుతం రేవంత్ కార్యకర్తలతో బిజీబిజీగా గడుపుతున్నారు.


Read more