దారుణం.... ఇద్దరు చిన్నారుల గొంతుకోసి చంపేసిన తండ్రి

ABN , First Publish Date - 2022-08-18T02:05:19+05:30 IST

దారుణం.... ఇద్దరు చిన్నారుల గొంతుకోసి చంపేసిన తండ్రి

దారుణం.... ఇద్దరు చిన్నారుల గొంతుకోసి చంపేసిన తండ్రి

నాగర్‌కర్నూల్‌: జిల్లాలోని కుడికిల్లలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారుల గొంతుకోసి తండ్రి ఓంకార్‌ చంపేశాడు. చిన్నారులు చందన(3), విశ్వనాథ్‌(1) మృతి చెందారు. అనంతరం తండ్రి గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తండ్రి ఓంకార్‌ పరిస్థితి విషమంగా ఉంది. ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. భార్యతో విభేదాలతోనే చిన్నారులను ఓంకార్‌ హత్యచేసినట్లు అనుమానిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. 

Read more