తెలంగాణ మరణశయ్యపై ఉంది: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

ABN , First Publish Date - 2022-02-20T01:25:22+05:30 IST

దొరలు, దోపిడీదారుల పాలన వల్ల తెలంగాణ రాష్ట్రం మరణశయ్యపై ఉందని బహుజన సమాజ్‌ పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ విమర్శించారు.

తెలంగాణ మరణశయ్యపై ఉంది: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

సుభాష్‌నగర్‌: దొరలు, దోపిడీదారుల పాలన వల్ల తెలంగాణ రాష్ట్రం మరణశయ్యపై ఉందని బహుజన సమాజ్‌ పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ విమర్శించారు. శనివారం ప్రవీణ్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ త్యాగాలకు సిద్ధపడకపోతే బీసీలకు హక్కులు రావన్నారు. బీసీలతో పాటు మైనార్టీ సమాజం ప్రమాదంలో ఉందన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలన్నీ ఆధిపత్య కులాల చేతుల్లోనే ఉన్నాయన్నారు. తాను ఏ కులానికీ వ్యతిరేకం కాదని ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. 75 శాతం సంపద 10 శాతం మంది వద్ద ఉందని ముఖ్యమంత్రి కేసీఆరే అన్నారని ఆయన చెప్పారు. ఆ పది శాతం మంది దగ్గర ఉన్న సంపదను అందరికీ పంచడానికి కేసీఆర్‌ను ఎవరు ఆపారని ప్రశ్నించారు. బహుజన రాజ్యం వస్తే ప్రభుత్వ ఆసుపత్రులు, విద్యాసంస్థలు కార్పొరేట్‌ సంస్థల కంటే దీటుగా అభివృద్ధి చేస్తామని ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

Read more