పీహెచ్ డి పూర్తిచేసిన బైల్ కమ్మర కులానికిచెందిన రాజ్యలక్ష్మి

ABN , First Publish Date - 2022-03-16T23:16:39+05:30 IST

దక్షణ భారత దేశంలోనే సంచార జాతులకు చెందిన బైల్ కమ్మర కులానికి చెందిన రాజ్యలక్ష్మి తొలి పీహెచ్ డి పట్టాను పొందిన మహిళగా నిలిచిందని తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు.

పీహెచ్ డి పూర్తిచేసిన బైల్ కమ్మర కులానికిచెందిన రాజ్యలక్ష్మి

హైదరాబాద్:దక్షణ భారత దేశంలోనే సంచార జాతులకు చెందిన బైల్ కమ్మర కులానికి చెందిన రాజ్యలక్ష్మి తొలి పీహెచ్ డి పట్టాను పొందిన మహిళగా నిలిచిందని తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. సాహిత్య అకాడమీ ఛైర్మన్ ను కలిసిన రాజ్యలక్ష్మి తను పిహెచ్ డి పొందిన విషయాన్ని తెలిపారు. బైల్ కమ్మరకులానికి చెందిన డాక్టర్ బికె రాజ్యలక్ష్మి సాఫ్ట్ స్కిల్స్ పై పీహెచ్ డి పూర్తి చేయడం హర్షించదగ్గ విషయమని జూలురు తెలిపారు.


తెలంగాణ ప్రభుత్వం బైల్ కమ్మరులను బీసీ జాబితాలో చేర్చుతూ కేబినెట్ తీర్మానించి గెజిట్ లో ప్రకటించినందున బికె రాజ్యలక్ష్మికి ఉద్యోగావకాశం పొందే అర్హతను సాధించిందని చెప్పారు. తెలంగాణ వచ్చే వరకు బైల్ కమ్మరులను ఎవరూ గుర్తించలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో బీసీ జాబితాలో చేర్చటం చారిత్రక పరిణామమని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బైల్ కమ్మరుల సంఘం ప్రధాన కార్యదర్శి కె.మోహన్ చౌహాన్, తుల్జారాం తదితరులు పాల్గొన్నారు.

Read more