ఢిల్లీకి చేరిన తెలంగాణ ధాన్యం కొనుగోళ్ల పంచాయితీ

ABN , First Publish Date - 2022-03-23T16:38:51+05:30 IST

తెలంగాణ ధాన్యం కొనుగోళ్ల పంచాయతీ ఢిల్లీకి చేరింది. నలుగురు తెలంగాణ మంత్రులు, ఎంపీల బృందం ఢిల్లీకి చేరుకుంది.

ఢిల్లీకి చేరిన తెలంగాణ ధాన్యం కొనుగోళ్ల పంచాయితీ

ఢిల్లీ : తెలంగాణ ధాన్యం కొనుగోళ్ల పంచాయతీ ఢిల్లీకి చేరింది. నలుగురు తెలంగాణ మంత్రులు, ఎంపీల బృందం ఢిల్లీకి చేరుకుంది. గత రాత్రి మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్, పలువురు ఎంపీలు ఢిల్లీకి చేరుకున్నారు. యాసంగి పంట కొనుగోలు అంశంపై కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఇప్పటికే కేంద్ర ఆహార ప్రజా పంపిణీ వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ అపాయింట్మెంట్ కోరారు. ధాన్యం సేకరణపై దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉండాలని, తెలంగాణ నుంచి వచ్చే పూర్తి ధాన్యాన్ని కేంద్రమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. ఈ యాసంగిలో వచ్చే ప్రతి ధాన్యం గింజ కేంద్రమే సేకరించాలని పియూష్ గొయల్‌ని తెలంగాణ మంత్రులు కోరనున్నారు.

Read more