అంత డబ్బు ఎక్కడ్నుంచి వచ్చింది?: షర్మిల

ABN , First Publish Date - 2022-10-03T02:57:53+05:30 IST

అంత డబ్బు ఎక్కడ్నుంచి వచ్చింది?: షర్మిల

అంత డబ్బు ఎక్కడ్నుంచి వచ్చింది?: షర్మిల

మెదక్‌: వీఆర్‌ఏలు తెలంగాణ బిడ్డలు కాదా? అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. వీఆర్‌ఏలు 70 రోజులుగా పోరాడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్‌ చేసిందేమీ లేదు.. దేశం మీద పడతారట అని విమర్శించారు. కేసీఆర్‌ కోట్లు పెట్టి విమానాలు కొంటారంట, టీఆర్‌ఎస్‌ నేతలకు ఇంత డబ్బు ఎక్కడ్నుంచి వచ్చింది?  అని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్‌ అవినీతి కోసం ఒక్క కాళేశ్వరం చూస్తే చాలన్నారు. కేసీఆర్‌ను ఫామ్‌హౌజ్‌కే పరిమితం చేసే రోజులు వచ్చాయన్నారు.  

Read more