ఏమైనా చేసుకోండి.. కేసీఆర్‌కు షర్మిల సవాల్

ABN , First Publish Date - 2022-09-22T00:49:24+05:30 IST

ఏమైనా చేసుకోండి.. కేసీఆర్‌కు షర్మిల సవాల్

ఏమైనా చేసుకోండి.. కేసీఆర్‌కు షర్మిల సవాల్

వికారాబాద్: మహా నేతకు మరణం లేదని మరో సారి నిరూపించారని వైఎస్ షర్మిల అన్నారు. ముఖ్యమంత్రి అంటే వైఎస్సార్.. పరిపాలన అంటే వైఎస్ఆర్ దన్నారు. ఏ పథకం ప్రవేశ పెట్టినా అద్భుతంగా అమలు చేసి చూపించారని కొనియాడారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో బాగంగా బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. కేసీఅర్‌ను రెండు సార్లు ముఖ్యమంత్రి చేస్తే ఏమైనా ఒరిగిందా? తెలంగాణలో కేసీఅర్ మోసం చేయని వర్గమే లేదు కదా? అని ఆమె ప్రశ్నించారు. కేసీఅర్ జన్మకి ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. కేసీఅర్ మాట నిలబెట్టుకొలేని మోసగాడని విమర్శించారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా నీళ్ళు తీసుకు రావాలని వైఎస్సార్ అనుకున్నారని, పరిగి నియోజక వర్గానికి వైఎస్సార్ బ్రతికే ఉంటే నీళ్ళు వచ్చేవన్నారు. అలాగే వైఎస్సార్ బ్రతికే ఉంటే 35 వేల కోట్లతో ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి అయ్యేదన్నారు. నేనే వస్తా కుర్చీ వేసుకొని కూర్చుంట అని ఇదే పరిగిలో మీటింగ్ పెట్టిన కేసీఅర్ ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వడానికి చేతనయ్యిందా..? అని ఆమె ప్రశ్నించారు. 


‘‘ఇవ్వాళ ఆయన గురించి మాట్లాడితే నన్ను గుడ్లతో కొట్టమని చెప్పాడు అంట. ఎందుకయ్యా గుడ్లు...ఇంటికి తీసుకు వెళ్లి అమ్లెట్ వేసుకోండి. ఇక్కడ మీ గుడ్లకు భయపడే వారు ఎవరు లేరు. మాకు ఏం అభ్యంతరం లేదు.. గుడ్లు వేసుకోండి.. చెప్పులు వేసుకోండి.. బాంబులు వేసుకోండి’’ అని ఆమె సవాల్ విసిరారు. 

Updated Date - 2022-09-22T00:49:24+05:30 IST