దాడి దృశ్యాలు వైరల్... పోలీసులు పట్టించుకోని వైనం

ABN , First Publish Date - 2022-09-20T00:38:08+05:30 IST

దాడి దృశ్యాలు వైరల్... పోలీసులు పట్టించుకోని వైనం

దాడి దృశ్యాలు వైరల్... పోలీసులు పట్టించుకోని వైనం

వికారాబాద్: జిల్లాలోని నవాబ్ పేట మండలం పులుసుమామిడిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పొలం విషయంలో వృద్ధ దంపతులపై టీఆర్ఎస్ నాయకుడు, ఎంపీటీసీ భర్త విచక్షణ రహితంగా దాడికి పాల్పడినట్లు బాధితులు వాపోతున్నారు. ఈ దాడిలో వృద్ధ దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. సోషల్ మీడియాలో దాడి దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. వృద్ద దంపతులకు వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పోలీసులు పట్టించుకోవడం లేదంటూ కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. 

Read more