హుస్నాబా‌ద్‌లో అధికార పార్టీ టీఆర్ఎస్‌కు షాక్

ABN , First Publish Date - 2022-07-19T22:11:16+05:30 IST

సిద్దిపేట జిల్లా హుస్నాబా‌ద్‌లో అధికార పార్టీ టీఆర్ఎస్‌కు షాక్ తగిలింది. టీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే అలిరెడ్డి ప్రవీణ్ రెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరారు.

హుస్నాబా‌ద్‌లో అధికార పార్టీ టీఆర్ఎస్‌కు షాక్

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా హుస్నాబా‌ద్‌లో అధికార పార్టీ టీఆర్ఎస్‌కు షాక్ తగిలింది. టీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే అలిరెడ్డి ప్రవీణ్ రెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకుడు మల్లిఖార్జునఖర్గే, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, షబ్బీర్ ఆలీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడిప్పుడే కాంగ్రెస్‌లో వలసలు జోరుగా కొనసాగుతున్నాయి. ఎలాగై ఈసారి ఎలక్షన్‌లో కాంగ్రెస్ గెలవాలని పట్టుదలతో ఉంది. అందుకు తగినట్లుగానే పార్టీ నేతలతో పాటు కార్యకర్తలు కూడా ప్రతి కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. 

Read more