ఫస్ట్‌, సెకండ్‌ ఫ్లోర్‌లో ఉన్నవారు ఊపిరాడక చనిపోయారు: సీపీ సీవీ ఆనంద్

ABN , First Publish Date - 2022-09-13T14:15:15+05:30 IST

ఫస్ట్‌, సెకండ్‌ ఫ్లోర్‌లో ఉన్నవారు ఊపిరాడక చనిపోయారు: సీపీ సీవీ ఆనంద్

ఫస్ట్‌, సెకండ్‌ ఫ్లోర్‌లో ఉన్నవారు ఊపిరాడక చనిపోయారు: సీపీ సీవీ ఆనంద్

హైదరాబాద్: సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనపై సీపీ సీవీ ఆనంద్‌ స్పందించారు. ఈ ప్రమాదంలో 8 మంది మృతిచెందినట్లు వెల్లడించారు. ఫస్ట్‌, సెకండ్‌ ఫ్లోర్‌లో ఉన్నవారు ఊపిరాడక చనిపోయారని తెలిపారు. పైనుంచి దూకిన వారికి తీవ్రంగా గాయాలయ్యాయని సీపీ తెలిపారు. ప్రమాద సమయంలో రూబీ లాడ్జిలో 24 మంది టూరిస్టులు ఉన్నట్లు పేర్కొన్నారు. నాలుగు ఫ్లోర్లలో మొత్తం 23 రూమ్స్‌ ఉన్నాయన్నారు. ఈ-స్కూటర్ షోరూమ్‌ వ్యాపారి రంజిత్ సింగ్ బగ్గపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. రంజిత్ సింగ్ బగ్గ పోలీసుల అదుపులో ఉన్నాడని చెప్పారు. అగ్ని ప్రమాద ఘటనపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు. 

Read more