బెదిరింపులకు భయపను: ఆర్‌ఎస్ ప్రవీణ్

ABN , First Publish Date - 2022-11-23T19:39:45+05:30 IST

డబ్బులతో ఎన్నికల్లో గెలవాలని చూస్తారని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆరు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు.

బెదిరింపులకు భయపను: ఆర్‌ఎస్ ప్రవీణ్

సిద్దిపేట: డబ్బులతో ఎన్నికల్లో గెలవాలని చూస్తారని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆరు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. సోషల్ మీడియాలోనే కాకుండా బహుజన కార్యకర్తలు గ్రామాల్లో ఉండాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లాలో వేలాదిమంది కార్యకర్తలను తయారు చేసినప్పుడే బహుజన రాజ్యం కల సహకారం అవుతుందన్నారు. తన తుది శ్వాస వరకు బహుజన రాజ్యం కోసం పోరాడుతానని స్పష్టం చేశారు. తనపై కేసులు పెట్టినా, బెదిరింపులకు భయపడనన్నారు. సిద్దిపేట బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో తన జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.

Updated Date - 2022-11-23T19:39:45+05:30 IST

Read more