కేసీఆర్ కుటుంబ పాలనను ప్రజలు పాతరేస్తారు: కిషన్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-08-16T00:25:54+05:30 IST

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్రపై దాడిని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఖండించారు. వారి పీఠాలు కదిలిపోతున్నాయనే టీఆర్‌ఎస్ భౌతికదాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్ కుటుంబ పాలనను ప్రజలు పాతరేస్తారు: కిషన్‌రెడ్డి

ఢిల్లీ: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్రపై దాడిని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఖండించారు. వారి పీఠాలు కదిలిపోతున్నాయనే టీఆర్‌ఎస్ భౌతికదాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని దాడులు చేసినా, రూ.కోట్లు ఖర్చుపెట్టినా.. కేసీఆర్ కుటుంబ పాలనను ప్రజలు పాతరేస్తారని చెప్పారు. టీఆర్‌ఎస్‌ సర్కార్ పట్ల పోలీసులది పక్షపాత వైఖరన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ, ప్రభుత్వం ఉండేది ఇంకా 6-7 నెలలేనని స్పష్టం చేశారు. 

Read more