నిమజ్జనోత్సవాల్లో మహిళలతో అసభ్య ప్రవర్తన

ABN , First Publish Date - 2022-09-13T16:19:50+05:30 IST

నిమజ్జనోత్సవాల్లో మహిళలతో అసభ్య ప్రవర్తన

నిమజ్జనోత్సవాల్లో మహిళలతో అసభ్య ప్రవర్తన

షీటీమ్‌ బృందాలకు పట్టుబడిన 240మంది 

2 నుంచి 10 రోజుల జైలు, జరిమానా  


హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన, వేధించిన 240మంది పోకిరీలను షీ టీమ్స్‌ బృం దాలు గుర్తించి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాయి. నిమజ్జనం రోజున వివిధ ప్రాంతాల్లో మఫ్టీలో ఉన్న మహిళా పోలీసులు నిఘా పెట్టి మహిళలను వేధిస్తున్న వారిని ఎక్కడికక్కడ ఆధారాలతో సహా అదుపులోకి తీసుకున్న ట్లు షీటీమ్స్‌ అదనపు సీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. పూర్తి ఆధారాలతో వారిని నాంపల్లి కోర్టులో హాజరుపర్చ గా 2 నుంచి 10రోజుల వరకు జైలుశిక్షతోపాటు రూ.250 జరిమానా విధిస్తూ మేజిస్ట్రేట్‌ తీర్పునిచ్చారని తెలిపారు. షీటీమ్స్‌ కనబర్చిన పనితీరును నగర సీపీ సీవీ ఆనంద్‌ అభినందించారు. 

Read more