ఇంజనీరింగ్ కాలేజీలో కరెంట్ కొరత

ABN , First Publish Date - 2022-07-18T22:06:15+05:30 IST

ఇంజనీరింగ్ కాలేజీలో కరెంట్ కొరత

ఇంజనీరింగ్ కాలేజీలో కరెంట్ కొరత

హన్మకొండ: నగరంలోని గణపతి ఇంజనీరింగ్ కాలేజీలో కరెంట్ కొరత ఏర్పడింది. దాని ప్రభావంతో ఎంసెట్ పరీక్షలు రాసే విద్యార్థుల ఇక్కట్లు పడుతున్నారు. ఉదయం 9 నుంచి ఒంటిగంట వరకు జరగాల్సిన ఇంజనీరింగ్ పరీక్ష ఆలస్యమైంది. ఇంకా పరీక్ష హాల్‌లోనే విద్యార్థులు ఉన్నారు. మధ్యాహ్నం 2గంటలకు జరిగే మరో పరీక్ష కరెంట్ లేక ఆలస్యమైంది. దాంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలోపడ్డారు. 

Read more