సీఎం కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-10-03T00:44:55+05:30 IST

మంత్రులు, జిల్లా అధ్యక్షులతో సీఎం కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్‌ఎల్పీ భేటీలో కొత్త పార్టీపై తీర్మానం చేస్తామన్నారు.

సీఎం కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: మంత్రులు, జిల్లా అధ్యక్షులతో సీఎం కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.  టీఆర్ఎస్‌ఎల్పీ భేటీలో కొత్త పార్టీపై తీర్మానం చేస్తామన్నారు. దసరా రోజు మంచి ముహూర్తం ఉందని సీఎం తెలిపారు.  దసరా రోజు మధ్యాహ్నం 1:19 గంటలకు కొత్త పార్టీ ప్రకటించనున్నట్లు కేసీఆర్ తెలిపారు. డిసెంబర్ 9న ఢిల్లీలో భారీ బహిరంగ ఏర్పాటు చేస్తామన్నారు.  డిసెంబర్ 6న పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఢిల్లీకి ప్రతినిధుల బృందం బయలుదేరనుందని చెప్పారు. కొత్త పార్టీకి కూడా గులాబీ జెండా, కారు గుర్తే ఉంటుందన్నారు. 

Read more