నలుగురు విద్యార్థులకు డెంగీ

ABN , First Publish Date - 2022-09-11T09:55:03+05:30 IST

నలుగురు విద్యార్థులకు డెంగీ

నలుగురు విద్యార్థులకు డెంగీ

గాంధీలో చికిత్స.. బాలిక పరిస్థితి విషమం..? 


అడ్డగుట్ట, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్‌ పరిధిలోని అడ్డగుట్ట ప్రభుత్వ పాఠశాలలో నలుగురు పిల్లలకు డెంగీ జ్వరం రావడం కలకలం రేపింది. స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న షోయబ్‌, నాలుగో తరగతి విద్యార్థి ఫాతిమా, ఐదో తరగతి చదువుతున్న ఆఫియా, ఆరో తరగతి విద్యార్థి సుజన విష జ్వరాల తో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో బుధవా రం వారిని గాంధీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో సుజన పరిస్థితి విషమంగా ఉం దని తెలుస్తోంది. అడ్డగుట్ట బడిలో మరుగుదొడ్లు లేకపోవడంతో పాఠశాల ఆవరణలోనే విద్యార్థులు మూత్రవిసర్జన చేస్తున్నారు. తాగేందుకు నీళ్లు కూడా లేవు. స్కూలులో అపరిశుభ్ర వాతావరణం నెలకొని ఉండటంతో ఇలా జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు.

Read more