హామీల అమలు ఏమైంది ?

ABN , First Publish Date - 2022-09-11T09:05:15+05:30 IST

హామీల అమలు ఏమైంది ?

హామీల అమలు ఏమైంది ?

మర్రిగూడలో రాజగోపాల్‌రెడ్డిని నిలదీసిన మహిళలు


సంస్థాన్‌నారాయణపురం, సెప్టెంబరు 10: ‘‘ఊరిలో మురుగు కాల్వలు, వాటర్‌ ప్లాంటు ఏర్పాటు చేస్తానని గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అప్పటి నుంచి ఒక్కసారి కూడా గ్రామం వైపు చూడలేదు. మూడున్నరేళ్లు గడిచిపోయాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా మళ్లీ మా ఊరికి ఎందుకొచ్చారు..?’’.. అంటూ పలువురు మహిళలు మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని నిలదీశారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలం సర్వేల్‌ గ్రామపంచాయతీ పరిధిలోని మర్రిగూడలో ఏర్పాటు చేసిన వినాయకుడి మండపం వద్ద పూజలు చేసేందుకు శుక్రవారం రాత్రి రాజగోపాల్‌రెడ్డి వచ్చారు. ఈ క్ర మంలో గ్రామ సమస్యలపై స్థానికులు, మహిళలు ఆయనను నిలదీశారు.  

Read more