రేపటి నుంచే సంజయ్‌ 4వ విడత యాత్ర

ABN , First Publish Date - 2022-09-11T08:58:01+05:30 IST

రేపటి నుంచే సంజయ్‌ 4వ విడత యాత్ర

రేపటి నుంచే సంజయ్‌ 4వ విడత యాత్ర

పాదయాత్రను అడ్డుకునే కుట్ర

పోలీసులు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా సాగుతుంది

బీజేపీ నేతల స్పష్టీకరణ


హైదరాబాద్‌, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టనున్న నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కుట్ర చేస్తోందని యాత్ర ప్రముఖ్‌ డాక్టర్‌ జి. మనోహర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌ కుమార్‌ ఆరోపించారు. సోమవారం నుంచి సంజయ్‌ పాదయాత్ర హైదరాబాద్‌లోని మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో కొనసాగనున్నందున సంబంధిత ఉన్నతాధికారులకు యాత్ర వివరాలు అందజేసినట్లు చెప్పారు. పోలీసులు అనుమతి ఇచ్చినా, ఇవ్వకపోయినా యాత్ర కొనసాగించి తీరుతామని స్పష్టం చేశారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు.  12న ఉదయం 10.30 గంటలకు కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని చిత్తారమ్మ ఆలయం వద్ద సంజయ్‌ ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్ర ప్రారంభిస్తారని తెలిపారు. 11 గంటలకు రాంలీలా మైదానంలో ప్రారంభ సభ నిర్వహిస్తామని, జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్‌ బన్సల్‌ హాజరవుతారని వివరించారు. 

Read more