అసెంబ్లీలో రెండు అధికారిక తీర్మానాలకు నిర్ణయం

ABN , First Publish Date - 2022-09-13T13:11:03+05:30 IST

అసెంబ్లీలో రెండు అధికారిక తీర్మానాలకు నిర్ణయం

అసెంబ్లీలో రెండు అధికారిక తీర్మానాలకు నిర్ణయం

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. నేడు కూడా ఉభయసభల్లో ప్రశ్నోత్తరాలు రద్దు చేయనున్నారు. అలాగే నేడు అసెంబ్లీలో రెండు అధికారిక తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. విద్యుత్‌ సంస్కరణలను వ్యతిరేకిస్తూ, ఉపసంహరించుకోవాలని తీర్మానం, కొత్త పార్లమెంట్‌ భవనానికి అంబేద్కర్‌ పేరు పెట్టాలని కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. అలాగే ఏడు బిల్లులపై అసెంబ్లీలో చర్చించనున్నారు. జీఎస్టీ, మోటార్‌ వాహనాల పన్ను, పురపాలక బిల్లులపై చర్చించనున్నారు. అజామాబాద్‌ పారిశ్రామిక ప్రాంత చట్టసవరణ బిల్లులపై కూడా చర్చించనున్నారు. వర్సిటీలకు ఉమ్మడి నియామక మండలి ఏర్పాటు బిల్లులపై చర్చించనున్నారు. 

Read more