రాహుల్ పాదయాత్ర అందుకే: భట్టి

ABN , First Publish Date - 2022-11-07T21:37:28+05:30 IST

దేశ సంపదను మోదీ తన మిత్రులకు పంచుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క అన్నారు.

రాహుల్ పాదయాత్ర అందుకే: భట్టి

హైదరాబాద్: దేశ సంపదను మోదీ తన మిత్రులకు పంచుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క అన్నారు. దేశం కోసమే రాహుల్‌ జోడో పాదయాత్ర అని తెలిపారు. రాహుల్‌గాంధీని భారత జాతి గుర్తుపెట్టుకుంటుందన్నారు. ఎన్నికల హామీలను సీఎం కేసీఆర్‌ నెరవేర్చలేదని ఆయన మండిపడ్డారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్‌ మాట తప్పారని అగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ పాలన అవినీతి మయమన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే అరెస్ట్‌లు చేస్తున్నారని మండిపడ్డారు.

Updated Date - 2022-11-07T21:57:32+05:30 IST

Read more