TS News: జనగామ జిల్లాలో కీచక ఉపాధ్యాయుడు..

ABN , First Publish Date - 2022-09-25T21:36:42+05:30 IST

జనగామ (Janagama): జిల్లాలో కీచక ఉపాధ్యాయుడి భాగోతం బయటపడింది.

TS News: జనగామ జిల్లాలో కీచక ఉపాధ్యాయుడు..

జనగామ (Janagama): జిల్లాలో కీచక ఉపాధ్యాయుడి బాగోతం బయటపడింది. విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో ఓ విద్యార్థిని హాస్టల్‌లో ఉంటూ  ప్రభుత్వ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఈ క్రమంలో అదే కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న వ్యక్తి.. ఆ విద్యార్థినికి మాయమాటలు చెప్పి హాస్టల్ నుంచి తీసుకువెళ్లాడు. విద్యార్థిని రాత్రి అయినా రాకపోవడంతో హాస్టల్ సిబ్బంది ఆమె కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో వారు వచ్చి ఆరా తీశారు. దాంతో లెక్చరర్ బాగోతం బయటపడింది. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. లెక్చరర్‌పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని పోలీసులు తెలిపారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Read more