బీజేపీ ముఖ్యనేతలకు అమిత్ షా సూచనలు

ABN , First Publish Date - 2022-09-17T21:59:50+05:30 IST

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో బీజేపీ ముఖ్యనేతల భేటీ ముగిసింది. జాతీయ నాయకత్వం అంచనాలను అందుకోలేకపోతున్నారన్న అమిత్‌షా అన్నారు.

బీజేపీ ముఖ్యనేతలకు అమిత్ షా సూచనలు

హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో బీజేపీ ముఖ్యనేతల భేటీ ముగిసింది. జాతీయ నాయకత్వం అంచనాలను అందుకోలేకపోతున్నారన్న అమిత్‌షా అన్నారు. పార్టీలో ఐక్యత కొరవడినట్లు తన దగ్గర సమాచారం ఉందని ఆయన తెలిపారు. ప్రజల్లో బీజేపీ పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ నాయకులు‌ మరింత కష్టపడితేనే ఫలితముంటుందని అమిత్‌షా పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రజా వ్యతిరేక విధానాలపై దూకుడు పెంచాలని అమిత్ షా సూచించారు. మునుగోడు ఉపఎన్నికపై ఫోకస్ పెట్టాలని ఆయన ఆదేశించారు. మునుగోడు ఉప‌ఎన్నిక కోసం కమిటీ నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై నేతలకు అమిత్‌షా దిశానిర్దేశం చేశారు. 

Read more