Cm Kcr Meets nitish kumar: బీజేపీ ముక్త్‌ భారత్‌ను నితీశ్‌ కూడా కోరుకుంటున్నారు

ABN , First Publish Date - 2022-09-01T00:02:35+05:30 IST

ప్రధాని మోదీ (Pm Modi) అబద్ధాలతో పాలన సాగిస్తున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్‌ (Telangana Cm Kcr) అన్నారు. గాల్వాన్ అమరుల కుటుంబాలకు చెక్కులు పంపిణీ ....

Cm Kcr Meets nitish kumar: బీజేపీ ముక్త్‌ భారత్‌ను నితీశ్‌ కూడా కోరుకుంటున్నారు

బిహార్: ప్రధాని మోదీ (Pm Modi) అబద్ధాలతో పాలన సాగిస్తున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్‌ (Telangana Cm Kcr) అన్నారు. గాల్వాన్ అమరుల కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేసిన సీఎం కేసీఆర్ .. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమా‌ర్‌ (Nitish Kumar)తో పాటు డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ (Tejaswi Yadav)తో భేటీ అయ్యారు. దేశ రాజకీయాలపై చర్చించారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కేంద్రంలో రొటీన్ ప్రభుత్వాలు వద్దని... దేశాన్ని మార్చే ప్రభుత్వం రావాలని పిలుపు నిచ్చారు. విద్యుత్‌ చట్టం తేవడం వెనక పెద్దకుట్ర ఉందని...  ప్రైవేట్‌లో బొగ్గు కొనాలని ఎందుకు ఒత్తిడి తెస్తున్నారని ప్రశ్నించారు. భూములను కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్ర చేస్తున్నారని.. ఇతర దేశాల ముందు భారత్ పరువు తీస్తున్నారని సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. 



‘‘బీజేపీ ముక్త్‌ భారత్ సాధించాలి. నితీశ్‌ కూడా బీజేపీ ముక్త్‌ భారత్ కోరుకుంటున్నారు.  బీజేపీ ముక్త్ భారత్‌ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తాం. విస్తృతంగా చర్చించాక నాయకత్వంపై నిర్ణయం. ఎవరు నాయకత్వం వహిస్తారనేది ఎన్నికల సమయంలో నిర్ణయం తీసుకుంటాం.  బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలి.  దేశంలో గుణాత్మక మార్పులు రావాలి. బీజేపీ ముక్త్‌ భారత్‌తోనే మనం ముందుకు వెళ్లగలం. బీజేపీ యేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలను కేంద్రం ఇబ్బంది పెడుతోంది.  అన్ని పార్టీలను తుడిచిపెడతామని బీజేపీ నేతలు అంటున్నారు.  మేకిన్ ఇండియా నినాదం ఏమైంది?. దేశాన్ని వినాశనం చేస్తున్నారు.’’ అని తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. 





Updated Date - 2022-09-01T00:02:35+05:30 IST