Telangana Assembly Sessions: అసెంబ్లీ‎లో కీలక బిల్లులపై చర్చ

ABN , First Publish Date - 2022-09-12T02:17:41+05:30 IST

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజుల విరామం తర్వాత సోమవారం తిరిగి ప్రారంభంకానున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయసభలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల ప్రారంభంలో ..

Telangana Assembly Sessions: అసెంబ్లీ‎లో కీలక బిల్లులపై చర్చ

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Sessions) ఐదు రోజుల విరామం తర్వాత సోమవారం తిరిగి ప్రారంభంకానున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయసభలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల ప్రారంభంలో దివంగత మాజీ ఎమ్మెల్యే భీమపాక భూపతి రావు మృతికి సంతాప తీర్మానం చేయనున్నారు. ఆ తర్వాత కేంద్ర విద్యుత్ చట్టంపై లఘు చర్చ చేపట్టనున్నారు. 


అనంతరం తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లును సీభలో సీఎం కేసీఆర్ (CM Kcr) ప్రవేశపెట్టనన్నారు. వీటితో పాటు మున్సిపల్ చట్ట సవరణ బిల్లును మంత్రి కేటీఆర్ (Minister Ktr) సభ ముందుకు తీసుకురానున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితి సవరణ బిల్లును మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) సభలో ప్రవేశపెట్టనున్నారరు. అటవీ విశ్వవిద్యాలయం బిల్‌ను మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy)..   విశ్వవిద్యాలయ సాధారణ నియామకాల బిల్లును మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Indra Reddy)..  తెలంగాణ రాష్ట్ర వాహన పన్నుల సవరణ బిల్లును మంత్రి పువ్వాడ అజయ్.. నిజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా లీజ్ సవరణ బిల్లును మంత్రి కేటీఆర్ సభలో ప్రవేశ పెట్టనున్నారు.


అనంతరం సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ 21వ వార్షిక నివేదికను మంత్రి జగదీశ్ రెడ్డి సభ‌కు సమర్పించనున్నారు. తెలంగాణ సమగ్ర శిక్షణ ఆడిట్ రిపోర్ట్‌ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి సభలో పట్టనున్నారు. ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ వార్షిక నివేదికను విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి టేబుల్ చేస్తారు. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి నిబంధనల సవరణ పత్రాన్ని కూడా మంత్రి జగదీష్ రెడ్డినే సభలో ప్రవేశపెట్టనున్నారు. 





Updated Date - 2022-09-12T02:17:41+05:30 IST