Tata Tea Gemini Tea: ఒగ్గు కథ ద్వారా విడి టీపొడిపై టాటా జెమిని అవగాహన

ABN , First Publish Date - 2022-09-25T02:54:11+05:30 IST

ప్రముఖ టీ బ్రాండ్లలో ఒకటైన టాటా టీ జెమిని తేనీటి ప్రియులకు అవగాహన కల్పించే కార్యక్రమలు చేపడుతోంది

Tata Tea Gemini Tea: ఒగ్గు కథ ద్వారా విడి టీపొడిపై టాటా జెమిని అవగాహన

హైదరాబాద్: ప్రముఖ టీ బ్రాండ్లలో ఒకటైన టాటా టీ జెమిని తేనీటి ప్రియులకు అవగాహన కల్పించే కార్యక్రమలు చేపడుతోంది. కల్తీ చేసిన విడి టీపొడితో తయారు చేసే తేనీరును సేవించడం ద్వారా కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. తెలంగాణలో ఇప్పటికే జనగామలో చేపట్టిన అవగాన కార్యక్రమానికి విశేష స్పందన రావడంతో ఇప్పుడు కరీంనగర్‌లోనూ తాజాగా అవగాహన కార్యక్రమం చేపట్టింది. ఇందుకోసం ఒగ్గు కళాకారులను ఎంచుకుంది. ఒగ్గు కథ ద్వారా జెమిని టీ చేపడుతున్న ఈ ప్రచారం అందరినీ ఆకర్షిస్తోంది. ప్రచారంలో భాగంగా కల్తీ టీ వల్ల కలిగే నష్టాలు, బ్రాండెడ్ టీ వల్ల ఒనగూరే ప్రయోజనాలను వివరిస్తోంది. 


ప్రచారంలో భాగంగా కల్తీ టీని ఎలా గుర్తించాలో కళకారులు ఒగ్గు కథ ద్వారా వివరించారు. ఇందులో భాగంగా లక్ష ఇళ్లలో ‘కోల్ట్ వాటర్ టెస్ట్’ చేయాలని నిర్ణయించుకుంది. ఇప్పటి వరకు తెలంగాణలో 30 వేలకుపైగా ఇళ్లలో పరీక్షలు నిర్వహించింది. ఈ సందర్భంగా టాటా కన్జుమర్ ప్రొడక్ట్స్ ప్రెసిడెంట్ పునీత్‌ దాస్‌ మాట్లాడుతూ.. కల్తీ,  లూజ్‌ టీ వల్ల కలిగే ఆరోగ్య సమస్యల పట్ల తెలంగాణ ప్రజలకు అవగాహన కల్పించాలనుకుంటున్నట్టు చెప్పారు.  తెలంగాణాలో ఈ తరహా టీ ప్రభావం ప్రబలంగా ఉందన్నారు. ఈ సందేశాన్ని మరింత ప్రభావవంతంగా ప్రజలకు చేరువ చేసేందుకు ప్రాంతీయ జానపద కళారూపం ఒగ్గు కథను ఎంచుకున్నట్టు చెప్పారు.

Updated Date - 2022-09-25T02:54:11+05:30 IST