డిగ్రీ విద్యార్థులకు ‘మన ఊరు మన చరిత్ర’ టాస్క్‌

ABN , First Publish Date - 2022-06-07T08:56:36+05:30 IST

డిగ్రీ విద్యార్థులకు ‘మన ఊరు మన చరిత్ర’ టాస్క్‌

డిగ్రీ విద్యార్థులకు ‘మన ఊరు మన చరిత్ర’ టాస్క్‌

హైదరాబాద్‌, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మన ఊరు మన బడి’ పథకం మాదిరిగా ‘మన ఊరు మన చరిత్ర’ టాస్క్‌ను డిగ్రీ విద్యార్థులకు ప్రభుత్వం ఇవ్వనుంది. సోమవారం తెలంగాణ విద్యా శాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌, తెలంగాణ సాహి త్య అకాడమీ చైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌ల భేటీ సందర్భంగా ఈ విషయంపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిపారు. డిగ్రీ విద్యార్థులతో వారి ఊరి చరిత్ర అంశాలను రాయించేందుకు ఇరువురు అంగీకరించారు. దీనికి ‘మన ఊరు మన చరిత్ర’గా నామకరణం చేయాలని నిర్ధారించారు.  

Read more