ప్రాజెక్ట్‌లు తీసుకొచ్చాకే గొంతు చించుకోవాలి: తలసాని

ABN , First Publish Date - 2022-07-11T22:46:02+05:30 IST

కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రద్దు చేస్తే తాము ముందస్తుకు రెడీ అవుతామని మంత్రి తలసాని అన్నారు. ఫారెస్ట్ యాక్ట్ కేంద్ర సర్కార్‌ చేతుల్లో ఉందన్నారు.

ప్రాజెక్ట్‌లు తీసుకొచ్చాకే గొంతు చించుకోవాలి: తలసాని

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రద్దు చేస్తే తాము ముందస్తుకు రెడీ అవుతామని మంత్రి తలసాని అన్నారు. ఫారెస్ట్ యాక్ట్ కేంద్ర సర్కార్‌ చేతుల్లో ఉందన్నారు. పోడు భూముల సమస్యలు పరిష్కరించాల్సింది కేంద్రమేనని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో కిషన్‌రెడ్డి లక్ష రూపాయలైనా ఖర్చు చేశారా? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వాలు పడగొట్టి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి బీజేపీ నేతలు ప్రాజెక్ట్‌లు తీసుకొచ్చాకే గొంతు చించుకోవాలన్నారు. మతం పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తుందన్నారు. తెలంగాణలో ఎన్ని గుళ్లు కట్టారో చెప్పగలరా? అని తలసాని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎవరు తప్పు చేసినా యాక్షన్ ఉంటుందన్నారు. టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల కుమారులైనా.. ఎవరైనా చట్టం దృష్టిలో ఒకటేనని స్పష్టం చేశారు. తప్పు చేసిన సీఐను సస్పెండ్ చేశామన్నారు. ఏక్‌నాథ్‌ షిండేలు ఎవరొస్తారో రండి చూసుకుందామన్నారు. 

Read more