టీ హోమంత్రి బిర్యానీ పంచాయితీ

ABN , First Publish Date - 2022-09-29T17:24:18+05:30 IST

పాతబస్తీ (Old City)లో బిర్యానీ (Biryani) కోసం పెద్ద వివాదమే రాజుకుంది. బిర్యానీ విషయంలో ఓ వ్యక్తి అర్ధరాత్రి

టీ హోమంత్రి బిర్యానీ పంచాయితీ

Hyderabad : పాతబస్తీ (Old City)లో బిర్యానీ (Biryani) కోసం పెద్ద వివాదమే రాజుకుంది. బిర్యానీ విషయంలో ఓ వ్యక్తి అర్ధరాత్రి హోంమంత్రి మహమూద్ అలీ (Home Minister Mahamood Ali)కి ఫోన్‌ చేశాడు. ఆ సమయంలో ఫోన్ చేసి నిద్ర లేపింది ఏదైనా సీరియస్ విషయమైతే పర్వాలేదు కానీ.. చాలా ఫన్నీగా ఎన్ని గంటల వరకూ బిర్యానీ హోటళ్లు (Biryani Hotels) తెరిచి ఉంచాలో చెప్పాలని కోరాడు. దీంతో హోమంత్రికి పట్టరాని కోపం వచ్చింది. తాను హోంమంత్రినని.. వంద టెన్షన్లు ఉంటాయని ఈ బిర్యానీ పంచాయతీ ఏంటని మహమూద్‌ అలీ ఫైర్ అయ్యారు. అర్ధరాత్రి ఫోన్‌ చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. 11 - 12 గంటల వరకంటే చాలా లేటు అయిపోతోందని అంత వరకూ క్లోజ్ చేయకుంటే ఇబ్బంది అవుతుందని ఆయన వాపోయారు. చివరకు రాత్రి 11 గంటలకే హోటల్స్ మూసేస్తారని మహమూద్‌ అలీ సూచించారు. దీంతో సదరు కాల్ చేసిన వ్యక్తి కాస్త శాంతించారు. అర్ధరాత్రి వరకూ బిర్యానీ విక్రయాల అనుమతి కోసం.. ఇప్పటికే ఎంఐఎం నేతలు హైదరాబాద్‌ సీపీని కలిశారు. అర్ధరాత్రి విక్రయాలకు అనుమతి ఉండాలని ఎంఐఎం నేతలు పట్టుబడుతున్నారు. ఇది హోటళ్ల యజమానులకు ఇబ్బందికరంగా మారుతోంది. 

Read more