TS News: సురేష్‌ను హత్య చేశారు: కుటుంబ సభ్యులు

ABN , First Publish Date - 2022-08-24T00:25:06+05:30 IST

నిర్మల్ : బాసర ట్రిపుల్ ఐటీ (Basara Triple IT)లో విద్యార్థి సురేష్ (Suresh) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న సురేష్‌ స్వస్థలం నిజామాబాద్ జిల్లా. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇటు ట్రిపుల్ ఐటీ

TS News: సురేష్‌ను హత్య చేశారు: కుటుంబ సభ్యులు

నిర్మల్ : బాసర ట్రిపుల్ ఐటీ (Basara Triple IT)లో విద్యార్థి సురేష్  (Suresh) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న సురేష్‌ స్వస్థలం నిజామాబాద్ జిల్లా. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇటు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సురేష్‌ ఆత్మహత్య చేసుకున్నా అధికారులు స్పందించడం లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ వాహనాలను ధ్వంసం చేశారు. కాగా తమ కొడుకు ఆత్మహత్య చేసుకోలేదని, హత్యకు గురైనట్లు అనుమానంగా ఉందని సురేష్ తండ్రి రాథోడ్ గంగారం తెలిపారు. సురేష్ ఒంటిపై గాయాలన్నాయని ఆయన పేర్కొన్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోస్టుమార్టానికి అనుమతించమని  కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సురేష్ మృతిపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సురేష్ మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. 

Read more