Supreme court: ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ వ్యవహారంలో కోనేరు మధుకు సుప్రీం నోటీసులు

ABN , First Publish Date - 2022-09-02T17:31:26+05:30 IST

ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ వ్యవహారంలో కోనేరు మధుకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.

Supreme court: ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ వ్యవహారంలో కోనేరు మధుకు సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ: ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ (Emaar Properties) వ్యవహారంలో కోనేరు మధు (Koneru madhu)కు సుప్రీం కోర్టు (Supreme court) నోటీసులు జారీ చేసింది. ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ వ్యవహారంలో మనీలాండరింగ్‌ అంశాలు చోటు చేసుకోవడంతో నిందితుడిగా పేర్కొంటూ  ఎన్‌ఫోర్సమెంట్ డైరక్టరేట్‌ (Enforcement Directorate) విచారణ చేపట్టింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ నమోదు చేసిన కేసును తెలంగాణ హైకోర్టు (Telangana high court) క్వాష్‌ చేసింది. మనీలాండరింగ్‌ చట్టం కింద నాంపల్లి సీబీఐ స్పెషల్‌ కోర్టు చేపట్టిన విచారణను క్వాష్‌ చేయాలన్న కోనేరు మధు వాదనలతో ఏకీభవించి తెలంగాణ హైకోర్టు క్వాష్‌ చేసింది. కోనేరు మధు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై గత ఏడాది జులై 18న తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఈడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ అజయ్‌ రస్గోగి, జస్టిస్‌ బి.వి.నాగరత్న ధర్మాసనం విచారణ చేపట్టి... కోనేరు మధుకు నోటీసులు జారీ చేశారు. 

Updated Date - 2022-09-02T17:31:26+05:30 IST